సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో గత అయిదేండ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు నేటి మంగ‌ళ‌వారంతో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా… మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా గత సోమ‌వారం మద్యం దుకాణాలను కేటాయించారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నవారు రేపటి నుంచి కొత్త పాలసీలో షాపులను తెరుచుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు కొత్త వైన్స్ తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి. రేపటి నుండి కొత్త షాపులు.. కొత్త రేట్లు, కొత్త బ్రాండ్లు .. అంతా కొత్త కొత్తగా ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *