సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో మార్పులు చేసారు. నేటి, సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రావలసిన వెంకయ్య నాయుడు , రూటు మార్చారు… చెన్నై నుంచి రైలు మార్గాన నేటి, సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ లోని గన్నవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్‌కు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాట్లను ట్రాఫిక్ ఏడిసిపి, అధికారులు పరిశీలిస్తున్నారు.
