సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఆంధ్ర ప్రదేశ్లో జగన్ సర్కార్ అలర్ట్ అయ్యింది. నేటి, సోమవారం నుంచి రాష్ట్రములో 34వ రౌండ్ ఇంటింటి (హౌస్ టు హౌస్) ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే ఇంటిటికి వెళ్లి నిర్వహించాల్సిందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు.ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్‌ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తారు. వారు వెంటనే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్, చికిత్సకు సంబంధించిన సూచనలు చేస్తారు. ఉచిత మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు. ఇప్పటికే 33 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి నియంత్రించడంలో ప్రభుత్వం సఫలీకృతం అయింది
