సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి కాలం భానుడు చెలరేగుతున్న నేపథ్యంలో.. చిన్నారి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ ఒంటిపూట బడులు నిర్వహించనున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నిర్వహించనున్నారు. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ లు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు చేయడం జరిగింది.
