సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలో ఇసుక కోసం వినియోగ దారులు పడుతున్న కష్టాలు నేటి బుధవారం నుండి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు నేటి బుధవారం నుండి ఇసుక రీచ్‌లను కేటాయించబడిన ఎల్‌ వన్‌ అభ్యర్థులు ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలకు అను గుణంగా ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 14 ఓపెన్‌ రీచ్‌లు కేటాయించామన్నారు. ఎటువంటి యంత్రాలు వినియోగించకుండా కనీసం రోజుకు వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాలన్నారు. రీచ్‌లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఇసుక తరలించే ప్రతి వాహనానికి జియో టాగింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ మేరకు క్రాస్‌ చెక్‌ చేయడంతో పాటు డీవియేషన్‌ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేటి బుధవారం నుండి వినియోగదారులకు ఇసుకను మరింత సులభంగా అందించేందుకు ఆఫ్‌ లైన్‌ బుకింగ్‌ అందుబాటులోకి వచ్చింది. నేటి నుండి ONLINE బుకింగ్‌ డెలివరీలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పూర్తవుతాయని.. ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడ్‌ చేస్తారని సమాచారం. ఆధార్‌ కార్డు, వినియోగదారుడి మొబైల్‌ నెంబరుతో బుకింగ్‌ చేస్తే ఓటీపీ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *