సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుత శుభ కార్యాల సీజన్ నేపథ్యంలో గోదావరి జిల్లాల ప్రయాణికులకు ఉపయోగపడేలా చర్లపల్లి( హైదరాబాద్)-కాకినాడ(Cherlapalli-Kakinada), నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-కాకినాడ టౌన్‌ (07031) ప్రత్యేక రైలు ఈనెల 15, 22, సెప్టెంబర్‌ 2వ తేదీ(శుక్ర వారం)వరకు మరియు కాకినాడ టౌన్‌-చర్లపల్లి(Kakinada Town-Cherlapalli) (07032) ప్రత్యేక రైలు ఈనెల 17, 24, 31 తేదీ(ఆదివారం)వరకు, హెచ్‌ఎస్‌.నాందేడ్‌-తిరుపతి (07015) ప్రత్యేకరైలు (ప్రతి శనివారం) 2026 మార్చి 28వరకు, తిరుపతి-హెచ్‌ఎస్‌.నాందేడ్‌ (07016) ప్రత్యేక రైలు( ప్రతి ఆదివారం) మార్చి 29, 2026 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *