సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నారు. అందమైన లైటింగ్ , పుష్ప అలంకారాలతో తిరుమల వైకుంఠ స్వర్గాన్ని మరిపిస్తుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. దేవతలను వేడుకలకు ఆహ్వానిస్తూ .. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను నేడు, మంగళవారం ఆలయ సన్నిధిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశగా భూదేవిని పూజించి మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసి క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అధికారులు తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉపగ్రహ నిఘా నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *