సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ప్రపంచంలో ఎక్కడ లేని అత్యధిక ధరకు NO.1 వంటగ్యాస్ ధర ఇండియాలోనే ఉందని మొన్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసి నెలరోజులు కాలేదు.. మరోసారి సామాన్యులపై మళ్లీ పెను భారం పడింది. దేశంలో నిత్యావసరాల ధరలన్నీ మండిపోతుంటే.. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పై కూడా వడ్డన మొదలైంది. వాణిజ్య వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌తో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌పై కూడా వడ్డించింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్ 14.5 kg సిలిండర్ ధర రూ. 50 మేర పెరగ్గా.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 మేర పెరిగింది. అంటే..మార్చి 1వ తేదీ అంటే నేటి బుధవారం నుండి మన తెలుగు రాష్ట్రాలలో సిలెండర్ ధర 1150 రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ పోర్ట్ అదనపు ఛార్జ్.. సుమారు 1200వరకు చేరుతుందన్నమాట.. ఇక కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే.. నిన్నటి వరకూ 19 కేజీలకు రూ.1769 ఉండగా.. నేటి బుధవారం నుంచి దీనిపై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ రేటు రూ.2119.50కి చేరింది. అంటే హోటల్ వ్యాపారులు ఆహారపదార్ధాలపై రేట్లు పెంచుతారు.( ఇంధన రిటైలర్లు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తారు.)
