సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నుండి భీమవరం మీదుగా బెంగుళూరుకు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ ప్రకటించింది. దానిలో భాగంగా నేడు, ఆదివారం రైలు నంబర్ 07153 బెంగళూరు వెళ్లడానికి నర్సాపురం – యశ్వంత్పూర్ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు అనగా సోమవారం ఉదయం 10.50 గంటలకి యశ్వంత్పూర్ చేరుకుంటుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 5న (సోమవారం)రైలు నంబర్ 07154 యశ్వంత్పూర్ నుండి మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8:30కు నరసాపురం చేరుకుంటుంది సెప్టెంబర్ 6న (మంగళవారం)రైలు నంబర్ 07156 బెంగళూరు వెళ్లడానికి నర్సాపురం – యశ్వంత్పూర్ రైలు మధ్యాహ్నం 2.20 గంటలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు అనగా బుధవారం ఉదయం 9.45 గంటలకి యశ్వంత్పూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 7న (బుధవారం) రైలు నంబర్ 07157 యశ్వంత్పూర్ నుండి సాయంత్రం 5:20 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 10:30కు నరసాపురం చేరుకుంటుంది.కావున భీమవరం , నరసాపురం పరిసర ప్రాంతాల లోని ప్రయాణికులు అవకాశాల్ని సద్వినియోగ పరుచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *