సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: స్టార్ మా ఛానెల్ బుల్లితెరపై బిగ్‌బాస్‌ సీజన్ 6 సందడి మొదలైంది. మరి కొద్ది గంటల్లో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ప్రారంభం కానుంది. కొత్త కంటెస్టెంట్స్‌, కొత్త టాస్క్‌లతో ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున వచ్చేస్తున్నాడు. తాజాగా బిగ్‌బాస్‌6కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్‌. అందులో ఆరో సీజన్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ని చూపించి చూపించనట్టుగా చూపించి ఆసక్తి రేకెత్తించారు. వాళ్ల ముఖాలను సరిగా చూపించలేదు కానీ వారిని గుర్తించొచ్చు. ముఖ్యంగా చలాకీ చంటి, సింగర్‌ రేవంత్‌ వాయిస్‌లు స్పష్టంగా వినిపించాయి. ఓ కంటెస్టెంట్‌.. నాగార్జున ను ఉద్దేశించి మిమ్మల్ని మాస్టారూ అని పిలవొచ్చా? అని అడగడంతో.. ‘మా..కి, స్టార్‌..కి మధ్య గ్యాప్‌ ఇచ్చి “మా”.. “స్టార్‌” అని పిలువు అని నాగ్‌ ఛానెల్ పేరునుద్దేశించి అనడం ఆయన టైమింగ్ తెలియజేస్తుంది. మెత్తానికి బిగ్‌బాస్‌ షో సీజన్ 6 మరింత మసాలా వినోదాలు ప్రేక్షకులకు పంచే దిశగానే కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *