సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. గుంటూరు విజయవాడ రైల్వే డివిజన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పనుల కారణంగా ఈనెల 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తోన్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. ప్రకటించిన వాటిలో పశ్చిమ గోదావరి మీదుగా ప్రయాణించే రైళ్లు వివరాలు: నెంబరు. 17239 గుంటూరు -విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ( నేటి నుండి) ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు, నెంబరు. 17240 విశాఖపట్టణం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. నెంబరు. 17282 నరసాపూర్ – గుంటూరు, నెంబరు. 17281 గుంటూరు – నరసాపూర్, నెంబరు. 17228 గుంటూరు డోన్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నామన్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు, సీజనర్లు గమనించి రైల్వేకి సహకరించాలని సీపీఆర్వో విజ్ఞప్తి చేశారు.
