సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలే గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ ధరలకు మేమేం తక్కువ కాదు అన్నరీతిలో మరోసారి తాజగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ సవరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేటి శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయి. తాజాగా మార్కెట్ విలువల్లో మార్పులకు సంబంధించి registration.ap.gov.in వెబ్ సైట్లో నేటి శనివారం ఉదయం 10 గంటల నుంచి వివరాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9,054 వార్డుల్లో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే పలు చోట్ల విజ్ఞప్తులు పరిశీలించి 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూములు విలువ తగ్గించినట్లు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఆధ్వర్యంలోని కమిటీలు ప్రజల నుంచి ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించినట్లు పేర్కొంది.
