సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59 వ వార్షిక మహోత్సవాలు సందర్భంగా మూలవిరాట్ శ్రీ అమ్మవారికి కలాపకర్షణ పూజలు నిర్వహించి అమ్మవారిని అలంకరించుటకు ఆలయము మూసివేయడమయినది. తిరిగి 29 వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఉంటుంది. ఈలోగా భక్తులు దేవాలయంలో అమ్మవారి ప్రతీక మూర్తిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ కార్య నిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేస్వరరావు మరియు ధర్మకర్తలు పాల్గొన్నారు
