సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నుండి గుంటూరు వైపు రైళ్లలో ప్రయాణించాలనుకొనేవారికి ముఖ్య గమనిక.. నేడు గురువారం నుండి ఆపరేషనల్‌ సమస్యల దృష్ట్యా ఈ నెల 20వ తేదీ వరకు గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ – కొండపల్లి మధ్యన మూడో రైలు మార్గం నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు చివరి ద శకు చేరుకోవడంతో కొన్ని గూడ్స్‌ రైళ్లను మోటుమర్రి – విష్ణుపురం మీదగా నడికుడి మార్గంలో మళ్లిస్తున్నారు. దీంతో ఆరు రోజుల పాటు ప్యాసింజర్‌ రైళ్లని రద్దు చేయాలని నిర్ణయించారు. విజయవాడ – గుంటూరు (నెంబరు.07783, 07628, 07464), గుంటూరు – తెనాలి(07887), గుంటూరు – రేపల్లె (077 86), రేపల్లె – తెనాలి(07873), తెనాలి – గుంటూరు(07282), గుంటూరు – విజయవాడ (07864, 07465), తెనాలి – రేపల్లె (07888), రేపల్లె -మార్కాపురం(07889), మార్కాపురం -తెనాలి((07890), తెనాలి – విజయవాడ(07630) ప్యాసింజర్‌ రైళ్లని రద్దు చేసిన ట్లు పేర్కొన్నారు. మాచర్ల – గుంటూరు ప్యాసింజర్‌ని నడికుడి వరకే నడిపినిలిపేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *