సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం కెసిఆర్ ఆద్వర్యంలోని టీఆరెస్ పార్టీ పేరు మార్చుకొని (జాతీయ పార్టీగా) తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం పొందింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా అవతరించిన వేళ నేడు,శుక్రవారం మధ్యాహ్నం సీఎం కెసిఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లొ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేశారు. పిడికిలి మందితో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని, ప్రజలందరికి కృషితో తెలంగాణ సాకారమైందన్నారు. 60 లక్షలు మంది పార్టీ సభ్యులున్న బీఆర్‌ఎస్(BRS) దేశానికి స్ఫూర్తిగా నిలవబోతుందని, దేశ రాజకీయాల్లో రైతు పాలసీ, జలవిధానాన్ని త్వరలో రూపొందించి, రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఆయన కర్ణాటక నుండి జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ఆహ్వానించారు. అంతేకాదు కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోరాడతామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాదే కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక తరహాలోనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో, ఒరిస్సా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా తెలుగు వారు ఉండే ప్రాంతాలలో బీఆర్ఎస్ తరపున అభ్యర్ధులను ప్రకటించవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
