సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం (ఆగస్టు 30) రాత్రి 8 గంటల తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో చంద్రుడు అరుదైన సూపర్ ఆరంజ్ మూన్ ( బ్లూ మూన్ అని కూడా అంటారు) గా కనువిందు చేయనున్నాడు.. పౌర్ణమి కూడా సమీపించడంతో రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, మరింత కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలో మీటర్లదూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రం గులో దర్శ నమివ్వ నున్నాడు. అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపిస్తుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *