సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ ముగింపు విద్యార్థులకు సెలవులు కూడా ముగుస్తుండంతో భీమవరం జోన్ నుండి హైదరాబాద్ కు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నేటి శుక్రవారం నరసాపురం నుంచి వికారాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 07440 నెంబరుతో రాత్రి 8గంటలకు ఈ రైలు నరసాపురం నుండి బయలుదేరి పాలకొల్లు, భీమవరం town మీదుగా , గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా వికారాబాద్‌కు మరుసటి ఉదయం 10 గంటలకు చేరుతోంది. మరో విషయం ఏమిటంటే.. గుంటూరు ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు జరిగింది. గుంటూరు– నరసాపురంల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సమయాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చారు. గుంటూరులో సాయంత్రం 5.45కు బయలుదేరి విజయవాడకు 6.50కు చేరుకుంటుంది. అక్కడ 7గంటలకు బయలుదేరి భీమవరం మీదుగా నరసాపురం రాత్రి 11 గంటలకు వస్తుంది. అయితే నరసాపురం నుంచి బయలుదేరే షెడ్యూల్ సమయాలను మార్చలేదు. యథావిధిగానే ఉదయం 6గంటలకు గుంటూరుకు బయలుదేరుతుంది.
