సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక.. పురపాలక సంఘానికి సంబంధించి వేర్ హౌసింగ్ గోడౌన్స్ వద్ద గల పాత పంపింగ్ మెయిను అనుకోని విధంగా రిపేర్ వచ్చినందున మునిసిపల్ పాత రిజర్వాయర్లకు నీటి సరఫరా లేనందున నేటి శుక్రవారం (అనగా 30-12-2022) సాయంత్రం నుండి 1నుండి 10 వార్డు ప్రజలకు మరియు 18 నుండి 28 వార్డుల లోని ప్రజలకు మునిసిపల్ కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా జరగదు. అలాగే నేడు శుక్రవారం పట్టణ శివారు ప్రాంతాలకు కూడా ట్యాoకుల ద్వారా( పట్టణము మొత్తము కూడా) మంచి నీటి సరఫరా జరగదు. కావున ప్రజలందరూ మంచి నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ తెలిపారు.
