సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనర్హులకు పెంక్షన్స్ అందుతునయ్యని వాటిని నిలుపుదల చేసే లక్ష్యంతో..రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు గోదావరి జిల్లాల లో ఎన్టీఆర్‌ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కు స్థానిక కలెక్టర్లు అధికారులను ఆదేశించారు . ఈ నేపథ్యంలో నేటి సోమవారం నుండి ఎంపిక చేసిన వార్డులలో వైద్య నిపుణులతో కూడిన అధికారుల బృందాలు పెంక్షన్ దారులను పరిశీలిస్తున్నారు.. నిర్దేశిత తేదీల్లో పెన్షన్‌ లబ్ధిదారుని ఇంటిని సందర్శించి లబ్ధిదారుని భౌతిక ఆరోగ్య స్థితిని వైద్య పరంగా పరిశీలిస్తారు. ప్రతీ వైద్య బృందంలో ఒక ఆర్థోపెడిక్‌ సర్జన్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్య నిపుణులు, సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉంటారు. సంబంధిత లబ్ధిదారులకు ముందుగానే సమాచారం తెలియచేస్తారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆ సమయంలో ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒకవేళ అందుబాటులో లేని లబ్ధిదారుల పెన్షన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్స్ ఆదేశించారు. పెన్షన్‌ వెరిఫికేషన్‌ బృందాలకు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్స్, నోడల్‌ అధికారులు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *