సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలోని చరిత్ర ప్రసిద్ధి పొందిన కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు గత ఫిబ్రవరి 21న ప్రారంభమైన విషయం విదితమే . ఈ ఉత్సవాలు ఈ మర్చి నెల 7 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా కీలకమైన ఘట్టం నేటి శుక్రవారం రాత్రి నిర్వహించే జలదుర్గ-గోకర్ణేశ్వర స్వామి వార్ల కల్యాణం ను వైభవంగా నిర్వహిస్తారు. దీనిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. మహిళలు మాత్రం ఆయా ప్రాంతాల నుండి ఉమ్మడిగా కలువ బోనాలను తలపై పెట్టుకుని మేళతాళాలతో తరలివచ్చి అమ్మ వారికి సమర్పిస్తున్నారు. ఆధ్యాత్మిక శోభా తో కొల్లేటి కోట ప్రాంతం కళకళ లాడుతుంది.
