సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఒక్కరోజు భారత దేశవ్యాప్తంగా ఏకంగా 173 రైళ్లను రద్దు చేసిన రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెంచడం కోసం, వాటి కి మరమ్మతుల చేయడానికని, ట్రాక్ ల మరమత్తులు కోసం, నేడు బుధవారం నాడు 173 రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. దీంతోపాటు మరో 35 రైళ్లను గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరో 9 రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ మార్చారు. నేడు మాత్రమే కాకుండా రేపు గురువారం (సెప్టెంబరు8) కూడా పలు రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, న్యూఢిల్లీ, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను రైల్వే ప్రయాణికుల సమాచారం కోసం రైల్వే వెబ్సైట్లో ఉంచామని రైల్వే అధికారులు చెప్పారు.
