సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 రోజులుగా ఉత్తర భారతంలో సముద్ర తీర రాష్ట్రాల ప్రజలను ముంబయి ప్రజలను వణికిస్తున్న ‘బిపర్జోయ్’ తుఫాన్ నేడు, గురువారం సాయంత్రం తీరం దాటనుంది. మాండ్వి (గుజరాత్), కరాచి (పాకిస్తాన్) మధ్య జఖౌ (గుజరాత్) సమీపంలో తుఫాన్ తీరం దాటనుంది. తుఫాను తీవ్రత దృష్ట్యా కొద్ది రోజుల క్రితం నుంచే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పెనుగాలులు, అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ద్వారకాలో శ్రీకృష్ణ దేవాలయాన్ని కూడా నేడు మూసివేశారు.కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహా వివిధ సహాయ బృందాలు ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నాయి. తుపాను తీవ్రత వల్ల తీవ్ర నష్టం వాటిల్లకుండా ముందస్తు సహాయచర్యల్లో నేవీ, కోస్ట్‌గార్డ్, ఆర్మీ బలగాలు పాల్గొంటున్నాయి.
