సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, ఆదివారం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కు ఆదివారం దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ యూజీ పరీక్షకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమ వరం, తణుకు, తాడేపల్లిగూడెంలలో ఏర్పాట్లుచేశారు. ఏలూరు సీఆర్‌ఆర్ అటానమస్ కళాశాలలో 504 మంది, సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూలులో 463, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో 384 మంది కలిపి మొత్తం 1,351 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారతీయ విద్యాభవన్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, తణుకులో స్టెప్పింగ్ స్టోన్స్ హైస్కూల్, శ్రీ ముళ్ళ పూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్, శ్రీరామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ), తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి లోటస్ స్కూల్, చినతాడేపల్లి శ్రీ చైతన్యస్కూల్‌లలోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది. పరీక్షార్థులను హాల్ టిక్కెట్లలో నిర్దేశించిన సమయంలో కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.. హాఫ్ హ్యాండ్ చేతుల షార్ట్స్ మాత్రమే వేసుకోవాలి.
