సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోనసీమ జిల్లా పర్యటన ముగించుకుని పవన్‌ నేటి ఆదివారం రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లాలో చించినాడ మీదుగా నరసాపురం చేరుకొంటారు. నేటి రాత్రి రాయపేటలో బస చేస్తారు. .పశ్చిమ గోదావరి జిల్లా అభిమానులు పవన్ కు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు సోమవారం ఉదయం శ్రీలక్ష్మి కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలతో సమావేశ మవుతారన్నారు. సాయంత్రం స్టీమర్‌రోడ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. రాత్రికి నరసా పురంలోనే బస చెయ్యడం కానీ లేదా భీమవరం బయలు దేరటం గాని జరుగుతుంది. భీమవరం శివారు లోని నిర్మలాదేవి పంక్షన్ హాలులో మంగళవారం ఉదయం జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇంకా భీమవరం షెడ్యూలు నిర్ధారణ కాలేదు. పవన్ కళ్యాణ్ రేపు నరసాపురం లో భీమవరం షెడ్యూలు ఫై నిర్ణయం తీసుకొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *