సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు నేటి శనివారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భముగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిడదవోలులో విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని ప్రకటించారు. రైతులు తమ పంటకు మంచి ధర పొందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్రంలో మొత్తం 5.40 కోట్ల గోతాలను సిద్ధం చేశామన్నారు. ధాన్యం రవాణా కోసం 17,200 లారీలకు జీపీఎస్ సదుపాయం కల్పించామని తెలిపారు
