సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది. గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షపు జల్లులు పడుతున్న నేపథ్యంలో తాజగా కోసాంధ్ర‌లో నేడు, బుధవారం , రేపు గురువారం పిడుగుల‌తో కూడి వాన‌లు ప‌డుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంద‌న్నారు. నేడు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో మేఘావృతం అయ్యింది. ఇక అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *