సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారతీయ స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వారికీ తన పోరాట ప్యూహంతో చుక్కలు చూపించిన పరాక్రమ శాలి ,ఆజాద్ హింద్ పౌజ్ అంటూ విదేశాలలో జైళ్లలో ఉన్న భారతీయులతో వేలాది భారతీయ సైన్యాన్నిప్రోగుచేసి జపాన్ వేదికపై బర్మా మీదుగా భారత్ లోని ఈశాన్య ప్రాంతాలనుస్వాతంత్రానికి ముందే జయించి, మన కాకినాడ ప్రాంతాలలో సైతం బ్రిటిష్ వారి పోర్టులపై విమానాలతో బాంబుల వర్షం కురిపించిన ఫైర్ బ్రాండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు “నేతాజీ అవార్డు 2022″ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలోనేడు, ఆదివారం వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు.
