సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత దశాబ్దం క్రితం వరకు 30 ఏళ్ళు పైగా తెలుగు తమిళ సినిమాలలో హీరోగా, విలన్ గా మంచి టైమింగ్ ఉన్న కామిడి నటుడుగా, సినీ నిర్మాతగా వెలిగిన సుధాకర్ తాజగా మీడియాకు ఒక వీడియో విడుదల చేసారు. ఇటీవల సోషల్ మీడియాలో గత వారం రోజులుగా తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. సుధాకర్ ఆరోగ్యం బాలేదని..ఐసీయూలో ఉన్నారంటూ ‘‘నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి రూమర్స్ ను మీరు ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని సుధాకర్ తెలిపారు.
