సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం విజయవాడలో వరద బాధితులకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ల నేతృత్వంలో లక్ష పాల పేకెట్స్, 2 లక్షల మంచినీటి బాటిల్స్ పంపిణి చేసారు. నేటి మద్యాహ్నం మాజీ సీఎం జగన్ రాజేశ్వరి పేటలో పర్యటించి వరద బాదితులిని పరామర్శించి వారికీ కావలసిన సహకారం అందిస్తామన్నారు. అనంతరం.. జగన్ మీడియా తో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన, ఫై స్థాయి నుండి కృష్ణ నదీ బుడమేరు వరద నీరు ఫై హెచ్చరికలు ముందే వచ్చిన కేవలం సీఎం చంద్రబాబు అలసత్వం వల్ల 30 మంది పైగా చనిపోవడం తో పాటు భారీ ఆస్థి నష్టం లక్షలాది ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. తమ వైసీపీ హయాంలో కృష్ణ నదికి 450 కోట్ల పైగా ఖర్చుతో సుమారు 5 కిమీ పైగా రక్షణ గోడ ముందు చూపుతో నిర్మించడం వల్ల ఈ రోజుకు విజయవాడ లో కృష్ణ లంక మునిగిపోయి ఇంకా లక్షలాది కుటుంబాలకు రక్షణ కలిగిందని అన్నారు. ఇప్పుడు బాధితులను ఆదుకొనేందుకు ఎక్కడా రిలీఫ్ క్యాం ప్లు లేవు. ఆఖరికి వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితిస్థి లేదు కాబట్టే అయన కలెక్టరేక్టట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ల్డ ఇస్తున్నారు. మా హయాంలో గోదావరికి వరదలొస్తే. బాధిత ప్రజలందరినీ వాలంటీర్లు సహకారంతో రిలీఫ్ క్యాంపు కు తరలించాం. చంద్రబాబు గత 4 నెలలు అసలు అధికారులను ఎక్కడ నిలబడనీయలేదు. కక్ష తో అన్ని చోట్ల బదిలీలే . ఎవరికీ కొత్త ప్రాంతాలపై పట్టు లేదు.. తాను చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే పెద్ద తప్పు చేశాను అట్లర్ ప్లాప్ అయ్యాను అని చంద్రబాబు ఒప్పుకోవాలి అని డిమాండ్ చేసారు.
