సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రతి ఏడాది భారత సైనికులతో కలిసి దీపావళి పండుగ సంబరాలు చేసుకునే ఆనవాయితీని ప్రధాని మోదీ ఈసారి కూడా కొనసాగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో నేవీ(Indian Navy) సిబ్బందితో మోదీ( PM modi with navy) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. సైనికులకు స్వీట్లు తినిపించి, వారితో ముచ్చటించిన మోదీ వారిలో స్ఫూర్తిని నింపారు. దేశ భద్రతలో నావికాదళం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. భారత్ ఆపరేషన్ సిందూర తో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి అన్నారు.
