సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో 2023 ఏడాదికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ మరోసారి దుమ్మురేపింది. ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి ( మొదటి లిస్ట్ లో 3 కలపి). భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబీ, గాంధీ తాత చెట్టు సినిమాలకు మొత్తం కలిపి ఏడు అవార్డులు దక్కాయి.జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా “భగవంత్ కేసరి” కి అవార్డు దక్కింది.భీమవరం కు చెందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘హనుమాన్‘ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ,మరియు ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి,బలగం సినిమాలోని “ఊరు పల్లెటూరు” సాంగ్కు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్. ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్)) బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్)బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (అగ్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు సినిమాకు ఆమె గుండు కూడా చేయించుకొని నటించడం విశేషం.
