సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజవర్గం వీరవాసరం మండలం నౌడూరు ప్రధాన సెంటర్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ Y.S రాజశేఖర్ రెడ్డి భారీ విగ్రహం ను భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వై యస్ విగ్రహం ఆవిష్కరించడం, గతంలో ఆయన సీఎంగా, నేను ఎమ్మెల్యేగా కలసి పనిచెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పనిచెయ్యడం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, పగో జిల్లా పరిషత్తు చైర్మెన్ కవురు శ్రీనివాస్, జిల్లా DCMS చైర్మన్, వేండ్ర వెంకట స్వామి మరియు వైసీపీ నేతలు గున్నం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు, నౌడూరు చౌరస్తాలో కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరు కావడంతో భారీ సందడి వాతావరణం కనపడింది.
