సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి ఎన్ ఆర్ కాలేజీ ఆవరణలోని గన్నబత్తుల పెదతాత ఆటస్థలంలో స్థానిక DNR Walkers అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దినికి ముఖ్య అతిధిగా DNR కళాశాల పాలక వర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు వచ్చి కేక్ కట్ చేసి తదుపరి కొత్త 2025 క్యాలెండరు ను ఆవిష్కరించినారు.మొదటి కాలెండర్ను భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి చవ్వా శ్రీనివాస సుబ్బారావు కి తదుపరి మిగతా సబ్యులకు అందజేశారు. ఆరోగ్యమే మహా భాగ్యంగా నడకతో పాటు ఇతర సులభతరమైన వ్యాయామాలు తో ఎక్కువ కాలం జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందమయింగా మార్చుకోవాలని, పెద్దలు తో పాటు పిల్లలు యువతరం ముందుగా ఆరోగ్య నియమాలపై, పౌష్ఠిక ఆహారం ఫై శ్రద్ద పెడితే వారి లక్ష్య సాధన సులభతరమౌతుందని వక్తలు పిలుపు నిచ్చారు.
