సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సా ర్సీపీ మద్దతు దారులు ఎక్కువ శాతం విజయాలు అందుకొన్నారు. టీడీపీ , జనసేన మద్దతు దారులు తమ విజయాలతో కొన్నిమెరుపులు మెరిపించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. పెదపాడు మండలం వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నకల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థి గెలుపు సాధించారు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును ఓడిం చారు. వణుదుర్రు సర్పంచ్ ఎన్ని కల్లో వైసిపి మద్దతుదారుడు గెలుపు సాధించారు. దెందులూరు మండలం ,కొవ్వలి గ్రామం లో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెదపాడు మండలం , పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎన్ని కలలో వైసిపి బలపరిచిన అభ్య ర్థి గొట్టపు సోమేశ్వ రి 26 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జీలుగుమిల్లి గ్రామం లో 6వ వార్డు ఉప ఎన్ని కల్లోవైసీపీ బలపరిచిన మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాలకొల్లుమండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైఎస్సా ర్సీ పీ బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి అం గర రామలక్ష్మి 10ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైఎస్సార్సీపీ బలపరిచిన కారేం పల్లి విజయలక్ష్మి 167 ఓట్లమెజారిటీతో గెలుపుసాధించారు. ఇక తణుకు సమీపంలోని ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి ఎన్నికలలో టిడిపి బలపరచిన వనచర్ల అప్పన్న స్వామి 164 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు అలాగే తణుకు మండలం తేతలి గ్రామంలోని 8వ వార్డుకు హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో టిడిపి బలపరచిన కోట దుర్గా రావు 9 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *