సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ రెండో తేదీ నుంచి ముగియనుండడంతో అదుపు లేని ఖర్చుకు ప్రభుత్వం నిబంధలు పెట్టింది, పంచాయతీ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను జమ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 309 పంచాయతీలకు సుమారు రూ.21 కోట్లు విదుదలయ్యాయి, అయితే వాటిని ఇష్టం వచ్చినట్లు బిల్లులు చెలించడానికి అనుమతి లేదు. ఈ మెలికతో ఇప్పటివరకు కేవలం పారిశుధ్యం నిర్వహణ, సిబ్బంది వేతనాలకు మాత్రమే నిధులు వినియోగిస్తూ వస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులకు కాంట్రాక్టులకు చెల్లింపులు జరగటం లేదు. కరెంట్ బిల్లులు కూడా బకాయిలు పడ్డాయి. అయితే తాజాగా పంచాయతీల నిధులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేందుకు అనుమతి రావడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీల్లో అభివృద్ధి పనులన్నీ ఎంబుక్‌లో నమోదు చేసి బిల్లులు మంజూరు చేస్తారు..ఇప్పటి వరకు నమోదు అయిన బిల్లులుకు చెల్లింపులు చేయాలని ఆదేశాలివ్వడంతో పంచాయతీలు తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాయి.. ప్రతి పంచాయతీ తమకు జమ అయిన ఆర్థిక సంఘం నిధుల్లో 10 నుంచి 15 శాతం వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
