సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు కు చెందిన తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేడు, శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ .. నేడు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉపఎన్నికల పోలింగ్ సరళి చూశాక వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రజలు ఖాతరు చేయలేదని స్పష్టమైందన్నారు. వాలంటీర్లు ప్రలోభపెట్టినా, పోలీసులు భయపెట్టినా.. అయితే వైసిపి నేతలు ఓటర్లు ను బెదిరిస్తున్నా..పల్లె ఓటర్లు పతనమయ్యే ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా నిర్భయంగా టీడీపీ అభ్యర్థులకే ఓటేశారన్నారు. ఉపఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని నిలువరించడంలో విఫలమైన కలెక్టర్లు, పోలీస్ అధికారులపై వారి నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నిమ్మల రామానాయుడు ప్రకటించారు.
