సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అధికారంలో ఉన్న లేకపోయినా సరే.. గ్రంధి శ్రీనివాస్ కుటుంబం పవిత్ర పంచారామ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాలయంలో భక్తుల అన్నసమారాధన కు ప్రతి ఏడాది బియ్యం కానుకగా దేవాలయానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. నేపథ్యంలో కార్తీక మాసం సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన నిమిత్తం 78 క్వింటాళ్ల త్రిబుల్ సెవెన్ బస్తాలను ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు కు ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు అందించారు. గ్రంధి శ్రీనివాస్ కుమారులు గ్రంధి సునీల్, రవితేజ లు ముందుగా ఆలయంలో శ్రీ స్వామివారికి, పార్వతి దేవికి, అన్నపూర్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు పాటు ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ పంచారామానికి తరలి వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో బియ్యాన్ని అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.
