సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్రమైన మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమిని పురస్కరించుకొని నేడు, శనివారం భీమవరం పంచారామ క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దంపతులు మరియు వారి కుమారుడు గ్రంధి రవితేజ దంపతులు, కుటుంబసమేతంగా నేటి,ఉదయం ఐదు గంటల నుండి శ్రీ సోమేశ్వర స్వామి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటుగా అన్నాభిషేకం, రుద్ర పాశుపత హోమం నిర్వహించారు. 11 మంది రుత్వికలతో వేద మంత్రాలతో రుద్ర పాశుపత హోమం, పాశుపత పూర్వక మహాభిషేకం, ఏకాదశ పూర్వక అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరంతో పాటూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాదేవుడిని, పార్వతి, అన్నపూర్ణమ్మ అమ్మవార్ల ను ప్రత్యేకంగా పూజించినట్లు, ఆయన తెలిపారు. మహాశివరాత్రి కి చేస్తున్న ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేసారు. ఈ కార్యక్రమం నందు పట్టణ ప్రముఖులు భక్తులు మరియు దేవస్థానం ధర్మకర్తలు కూర్మదాసు సత్యశ్రీనివాస్, నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పాల్గొన్నారు అని కార్యనిర్వాహణ అధికారి రామకృష్ణంరాజు తెలిపారు.
