సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని , గునుపూడిలో సాక్షాతూ చంద్రుడు ప్రతిష్ట చేసిన రంగులు మారే అరుదయిన శివలింగం గా భాసిల్లుతున్న స్కంద పురాణ ప్రాశస్యం ఉన్న పవిత్ర పుణ్యక్షత్రం ‘పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం‘ నందు మహాశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం ది.02-11-2024 నుండి ది.01-12-2024 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీకమాసోత్సవములు సందర్భముగా విశేషంగా వచ్చే భక్తులకు యాత్రికులకు శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల నిత్య అన్నదానం ట్రస్టు ద్వారా నిర్వహించు అన్నసమారాధన కార్యక్రమం నందు దాత పేరున అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ మహత్తర అవకాశం లో దాతలుగా పాల్గొనే అదృష్టవంతులు శ్రీ స్వామి వారి దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించాలని కార్యనిర్వాహాధికారి, రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు, సెల్ నెం.9963752144, 9491009678,9052431456 సంప్రదించవచ్చు..
