సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, గునుపుడి పంచారామ క్షేత్రంలోని అన్నపూర్ణమ్మ అమ్మవారి కి బియ్యం మొక్కుబడి చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమేశ్వర స్వామి ఆలయ పాలకవర్గం, ఆలయ అధికారులు, అన్నదాన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 2004 నుండి 2009 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన నేటి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ సొమ్ముకు తోడుగా ఆయన సొంతంగా మరో లక్ష రూపాయలు వేసుకుని అన్నపూర్ణమ్మ దేవి కి బియ్యం రూపంలో మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. అయితే కరోనా సమయంలో గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే అన్నదానం కార్యక్రమం నిలిపివేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చేనెల 13వ తేదీ నుండి ప్రారంభం కానున్న కార్తీమాసం సందర్భంగా కార్తీకమాసం నెల అంతా కూడా భక్తులకు నిత్య అన్నదానం చేయాలని, ఇందుకు సంబంధించి ముందుగా 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఇస్తున్నామని ఆయన వారికి తెలియజేసారు. వచ్చే కార్తీక మాసం కు దేవాలయంలోభక్తులకు ఏర్పాట్లు బాగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు.
