సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు మరియు వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయ ధర్మదాయ శాఖ, భీమవరం వారి సమక్షంలో గత 124 రోజులకు భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలు లెక్కించుటకు నేడు, గురువారం హుండీలు తెరచి లెక్కించగా రూ.7,53,338/-లు నగదు రూపంలో రాగా, బంగారం 11 గ్రాముల, 400 మిల్లిగ్రాములు, వెండి 275 గ్రాముల 100 మిల్లి గ్రాములు, విదేశి నగదు 10 కెనడా డాలర్ నోటు-1, 2 సింగపూర్ డాలర్ల నోటు-1, 10 సింగపూర్ డాలర్ల నోట్లు-2, 10 ఖతార్ రియల్స్ నోటు-1, 1 అమెరికన్ డాలర్ నోట్లు-2 వచ్చాయని ఆలయ ఇఓ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
