సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గునుపూడి భీమవరం నందు వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్ధానం నందు శివరాత్రి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, ఆదివారం కూడా వేలాది భక్తులు స్వామివారిని రాత్రి 9న్నర వరకు విశేషంగా దర్శించుకోవడం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ కోడె విజయలక్ష్మి దేవాలయం వద్దే ఉండి భక్తులకు ఏర్పాట్లు స్వామివారి కార్యక్రమాలు పర్యేక్షిస్తున్నారు. నేటి సాయంత్రం రధోత్సవం ఘనంగా జరిగింది. నిన్న శివరాత్రి మహోత్సవం సందర్భముగా పూజలవలన రూ.33,100/- లడ్డుల అమ్మకం వలన రూ.33,750/- దర్శనముల వలన రూ.4,14,400/- మొత్తం ఆధాయం రూ.4,81,250/-లు వచ్చిందని ఆలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ తెలిపారు. రేపు రాత్రి తెప్పోత్సవం కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాశివరాత్రి కి బంగారు హారంతో పుష్ప అలంకారంలో శ్రీ సోమేశ్వరుని దివ్య స్వరూపాన్ని వీక్షించవచ్చు..
