సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో నేటి బుధవారం తెల్లవారు జాము నుండి మహాశివరాత్రి సందర్భంగా . హరహర మహాదేవ శంభో శంకర అని భక్తుల శివనామ స్మరణతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి అయితే విధి విపరీతం ..తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపూడిలో గోదావరిలో పుణ్య స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. నేటి తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ లోతుగా ఉన్న ప్రదేశాన్ని గమనించని ఐదుగురు యువకులు నీటిలో స్నానానికి మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతయ్యారు. తోటి యువకుల అరుపులు విన్న స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి. దుర్గాప్రసాద్ (19) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎ. పవన్ (19), జి.ఆకాశ్ (19) ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకులంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.వారి కుటుంబాలకు అందేవచ్చిన యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో విషాదం అలముకొంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వేకువజాము నుంచే భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు దర్మనానికి వెళ్లారు. అనంతరం లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు నీటిలోకి దిగారు.అయితే స్నానం చేస్తూ కొంచెం లోపలికి వెళ్లడంతో ఈత రాక ఒకరు ముగిపోయారు. స్నేహితుడిని కాపాడేందుకు వెళ్లిన మిగతా ఇద్దరూ గల్లంతయ్యారు. అధికారులు గజఈతగాళ్లు రంగంలోకి దింపి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. .
