సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీరామ నవమి పండుగ వేళ ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పండగ వేళా నేడు, ఆదివారం మధ్యాహ్నం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు సరదాగా స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15).. వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో ఊహించని విధంగా ముగిపోయారు. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. పోలీసులు.. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. .బాలురలో ఒకరైన మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలు లో ఆ గ్రామం తీవ్ర విషాదం నిండిపోయింది.
