సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలోని సముద్ర దివి ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన (Pamban Bridges)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు, ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. గతంలో ఉన్న బ్రీజ్ పాతబడటం తో దానితో పాటు మరో కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర వంతెన ఇది. రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఇదో ప్రత్యేకత చేకూర్చింది. 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా (వర్టికల్ లిఫ్ట్) రూపొందించారు.. రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. వంతెన కింద ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకు పచ్చజెండా ఊపారు.
