సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 38 లక్షల రూపాయలతో కముజువారిపాలెం నందు ఇంటర్నల్ CC రోడ్లు మరియు సిసి డ్రైన్ లకు శంకుస్థాపన చేసారు. తదుపరి 7వ వార్డులో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రజకుల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం పట్టణాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నామని, పట్టణంలోని వార్డులలో ఇంకా ఎక్కడైనా అభివృద్ధి పనులు జరగాల్సి ఉందని ప్రజలు కోరుకుంటే ఆ వివరాలను తమ దృష్టికి తీసుకురావాలి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. భీమవరం పట్టణ అభివృద్ధి నాడు నేడు కూడా మన హయాంలోనే జరిగింది. కరోనా రెండు సంవత్సరాల పాటు అన్ని విధాలుగా ప్రజలతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసింది. ప్రజల అభిష్టం మేరకు భీమవరంలో జిల్లా కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్ సహకారంతో ఏర్పాటు చేసుకోగలిగం, ఉన్నత అధికారులు అందుబాటులో ఉండడం, మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ పి ప్రశాంతి. కూడా పనిచేస్తుండడంతో భీమవరం పట్టణాన్ని రాష్ట్రస్థాయిలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి రేయిబవళ్ళు కృషి చేస్తున్నామన్నారు. గత బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీఎం జగన్ ను కలసి భీమవరం లో జరిగిన అభివృద్ధి వివరించి , మరింత సహకారం కావాలని అభ్యర్ధించడం.. దానికి సీఎం జగన్ సానుకూలంగా హామీ ఇవ్వడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *