సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు, శనివారం ఆయన నివాస పరిధిలో ఉన్న 20వ వార్డులో ఇంటిటా ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పలువురు మహిళలు ఆయనకు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం పట్టణానికి సంబంధించి, గత పాలకుల హయంలో జరిగిన అభివృద్ధిని, ఈ 58 నెలల కాలంలో తన హయంలో చేసిన అభివృద్ధిలో తేడాను ప్రజలు గుర్తించడం జరిగిందని అన్నారు. పట్టణంలో 39 వార్డులలో 100 కోట్ల పైగా నిధులతో ప్రధాన రోడ్లతో పాటు శివారు ప్రాంతాలలో ప్రజల కోసం సీసీ రోడ్లు, డ్రైన్ లను నిర్మించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో పట్టణంలో పెరిగే ప్రజలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. అమృత పథకంలో భాగంగా వాటర్ రిజర్వాయర్ లను నిర్మించి భవిషత్తు తరాలకు కూడా నీటి ఇబ్బంది లేకుండా చేసానని ప్రజలకు తాను చేసిన సేవలను వివరించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *