సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి త్వరలో జరగనున్న తూర్పు , పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 97,084 మంది ఓటర్లు ను జిల్లా అధికారులు నిర్ధారించారు. ఎన్నికల సంఘం జారీచేసిన షెడ్యూ లు ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాను గత శనివారం అధికారికంగా విడుదల చేశారు. మరల ఈ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను సమస్యలను డిసెంబరు 9 వరకు నమోదు చేసుకొంటారు. 25వ
తేదీలోగా ఫైనల్ నిర్ణయిస్తారు. తుది జాబితా డిసెంబరు 30న విడుదల చేస్తారు. భీమవరం జిల్లా కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60, 816 ఓటర్లు ను గుర్తించి వారికీ జిల్లా వ్యాప్తంగా 93 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. మరింత సమాచారం కోసం 1950 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలి.
