సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన ఘర్షణ పరిణామాల నేపథ్యంలో సీఐ కనకారావు గాయపడటం అతను చేసిన పిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజగా పట్టాభి రామ్ కు జిల్లా కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలయ్యారు. బెయిల్ కోసం రూ.25వేల చోప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేడు, శనివారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు గన్నవరం వెళ్లాను. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కరెంటు తీసేసి నన్ను కొట్టారు అని ఆరోపించారు. ఇప్పటికీ నాలుగు సార్లు నాపై దాడి జరిగింది. అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాను. మా కుటుంబానికి..మనోధైర్యం కల్పించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు’’కు పట్టాభి ధన్యవాదాలు తెలిపారు.
