సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో అతి త్వరలో చక్కటి భారతీయ మార్క్ కాషాయ రంగులో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు పలు నగరాలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 180 కిలోమీటర్లు వేగంగా ప్రయాణించే ఈ రైలు తీరును పలు ప్రాంతాల్లో పరీక్షించారు. ఆ క్రమంలో ఈ ట్రైన్ ఖచ్చితమైన వేగంతో దూసుకెళ్లింది. గతంలో వందే భారత్ లో కూర్చుని మాత్రమే ప్రయాణించాలి. అయితే ఈ వందే భారత్ స్లీపర్ రైలు లో ప్రయాణికులు సౌకర్యంగా పడుకోవడానికి అధునాతన స్లీపర్ కోచ్ లు ఉన్నాయి. అంతే కాదు 180 కిలో మీటర్ల వేగంగా వెళుతున్న ట్రైన్‌లో నీటితో నింపిన ఓ గ్లాసు నుంచి చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. అందుకు సంబంధించిన ఓ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా లో తాజగా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. చుసిన వారు ఈ భారతీయ ట్రైన్ పనితీరును పొగడకుండా ఉండగలరా? బహుశా వందే భారత్ స్లీపర్ వచ్చే ఫిబ్రవరి నుండి పట్టాలు ఎక్కే అవకాశలు ఉన్నాయి.
